|
Blog > My Poetry Not all rainy days are exciting
Posted on September 11, 08 @ 05:22 am under My Poetry and has no comments.
some will be happier..
some will be scary..
some will be romantic..
and some will be ugly..
some will touch our eyes with affection..
some will bring tears in our eyes..
some will touch the tender leaves..
some will drain rocky hills..
some will make us remember our past..
some will make us forget our past.. 
Little words
Posted on September 11, 08 @ 04:45 am under My Poetry and has no comments.
చిటారుకొమ్మనుండే కోయిల.. నవవసంత వేళ.. పులకించి కూస్తూ ఉంటే..
నింగినుండే ఆమని కాస్తయినా కరుణించక వసంతాన్ని ఇవ్వదే..
తను కూడా భూమి మీద ఉందామని విఫలయత్నాలు చేసే సముద్రపు అలలలా ఉంది నా స్థితి.
చిగురించిన చామంతిని చక్కిళ్ళతో ముద్దాడుతూ
చిరునవ్వుతో నను చూస్తుండగా
ప్రతి నిమిషం పరవశించే నా హృదయాన్ని నీకిచ్చి
నే రాతి మనిషినయినాను.

For a little rose flower..
Posted on June 29, 08 @ 01:20 am under My Poetry and has no comments.
చిన్ని మొక్కనుంచి వచ్చే ఆ పువ్వును చూస్తున్నంతసేపు
ఆగని నా ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ
మదిన నిలిచిన నా చెలి మనోహర రూపాన్ని గుర్తు చేసుకుంటూ
ఈ కుసుమ చిరునవ్వును వర్ణిస్తూ రాస్తున్నను ఇదే ఆలకించు.
ముద్దుగొలిపే ఆ మొగ్గని చూస్తున్న ఆకుల మధ్యలో
తన సౌందర్యాన్నంతటినీ తనలోనే దాచుకుని
నిరీక్షణ ఫలితం మధురంగా ఉంటుందని తెలుపుతూ
మెల్లి మెల్లిగా వికసిస్తున్న ఆ కుసుమ కిరణాలకిదే ఓ అక్షరమాల.
లోకానికి వచ్చిన ఒక కొత్త అతిథిని చూసి
తోటి మొక్కలు, పూలు మురిసిపోతూ ఉంటే
ఆ మురిపాన్ని అంతటినీ చేరవేస్తున్న గాలి
స్పృశించే ఆ చెక్కిలి కందిపోయినట్టు ఉన్నదే
అందరి అనురాగాన్ని పొందిన ఆ మొగ్గ
కొద్ది కొద్దిగా ఎదుగుతూ తోటి మిత్రులకు అలవాటు పడుతూ
ఒక్కొక్క రెక్క నింపాదిగా విచ్చుకుంటూ
తన పరిమళాన్ని నలువైపులా వెదజేయబోతోంది.
అలాంటి పరిమళాన్ని నా మదిలో గుర్తుచేసినందుకు
సమర్పిస్తున్నను నీకే ఈ కుసుమ కవితాంజలి

Sudoku
Posted on January 03, 08 @ 02:12 am under My Poetry and has no comments.
ఆడకు సుడోకు
వచ్చును నీకు డోకు
ఇది కాదు జోకు
అవుతావు పోరంబోకు
Meaning:
Dont play Sudoku
You will get vomiting
this is not joke
you will become useless..
[Poetry in association with Suresh]

Chiru Prasalu
Posted on October 19, 07 @ 10:10 pm under My Poetry and has no comments.
మనసు కుదిరిన బ్రతుకుని
మరల సంసార ఊబిలోకి లాగి
మతి భ్రమింపజేసే
శివునకు సుమాంజలి
--------------------
భగవంతుడిని తలుద్దామనుకుంటే
సిరివచ్చి తలుపు తట్టి
జగత్తును పాలించే నేను వచ్చానన్నప్పుడు
సిరి నాకెందుకు.. సాక్షాత్తు శ్రీనివాసుడే ఉండగా అని చెప్పితిన్
తలవని తలంపుగా వచ్చిన దాన్ని కాదన్నందుకు
శ్రీనివాసుడే సిరినొసంగును కదా..
--------------------
దాక్కున్న చిత్తానికి, దాగని బుద్ధికి
దరువేయని సందర్భానికి, దారాలులాగే ఆలోచనలకి
దర్జాలేని బ్రతుక్కి, దక్షిణానికెళ్ళని ప్రాణానికి
దామోదరుడిని తలవని తలకి, కోటి దండాలు.
--------------------
కృష్ణుడిని పిలిచి వెన్న ఇచ్చిన ఆనాటి గోకులంలో
చిత్తం చపలంగా ఉండేది కదా..
ఈ నాటి ఈ కృష్ణుడు పలకరించినంతనే
చిత్తం చెత్తలో కలయునా?
--------------------
పరగతం అయిన మనస్సుకి
పరమార్థం మరచిన బ్రతుక్కి
పరమాత్ముడిని వదిలిన బుద్ధికి
పరమాద్భుతం చూపు పరమేశ్వరుడు.
--------------------
పందెంలో గెలిచిన డబ్బు
దుబారా అవునేమో కానీ
పరమాత్ముడిచ్చిన మోక్షం
అక్షయం అయి తీరుతుంది.
--------------------
వెళ్లిన వాళ్ళని తిరిగి రమ్మనడంకంటే
ఉన్న వాళ్ళతో ముచ్చటించుట మేలు
--------------------
కారుణ్య హృదయాన్ని కాదన్న పాపానికి
కదలివచ్చిన అదృష్టం వద్దన్న పొరబాటుకి
కాకుల సత్యం తెలియని బ్రతుక్కి
కుదరకనే వైరం వచ్చును
--------------------
గట్టుమీద జాలరి గట్టుదిగితేనే చేపలు లభించునే
గుడిచుట్టూ తిరగని పాదాలు బురదనే గుడనెనే
గిరిదిగని వేంకటపతికి భువివదలని మానవుడికి
గాజులు తొడిగి గరిటె చేతికీయవచ్చును
--------------------
భ్రమపడే చిత్తనికి
భ్రమలో ఉండే జీవితానికి
బ్రహ్మాండనాయకుడు
బుద్ధి చెప్పులే
--------------------
గరికకు గడ్డికి తేడా తెలియని మనిషి
ప్రేమకు ఆప్యాయతకి అర్థం చెప్పని మనిషి
ప్రాణనాథుని ప్రాణేశ్వరుడిని గుర్తించని మనిషి
బురదలో పొర్లే పందులవలె బ్రతుకులే
--------------------
జగదోద్రేకమున విసవిసలాడే మనుషులను
జగదాధారమైన విష్ణువే మార్చులే
--------------------
మగడి మనసు గుర్తించని మగువని
మండువాలో చెంబు తీయని ముసలమ్మని
మండు వేసవిలో మాడిన బ్రతుకులకి
మాహేశ్వరుడు విషమిచ్చి రక్షించులే
--------------------
వేదాంతం వదలని వటువు వైద్య గోష్ఠిలో పాల్గొని
వాణిజ్యుని వార్త వినిపించిన విస్తుపోరా?
--------------------
ఆడదాన్ని నమ్మి చెడిన మనసుని వదిలి
ఆగస్త్యుని మాట నమ్మి
రామ నామము జపించు
దేహరాజా..
--------------------
మురికి పట్టిన మనసుల్లోని బుద్ధి
ముకుందుని చూపులో శుద్ధికాదా..
--------------------
మనిషి కడుపుకి అన్నమే ఆహారం
మగడి కంటికి ఆడదే ఆహారం
--------------------
ధరణి కడుపున దాగి ఉన్నా
కడలి చివరకు చేరునన్నా

Lonely Buddy
Posted on May 21, 07 @ 12:13 pm under My Poetry and has no comments.
I feel lonely.
without a dear talk
without a caring touch
without a friendly look
i feel lonely
i feel lonely
my buddy said, he had his girl
who cares alot and talks to him
i asked him what makes them happy
he told me that the love they feel.
i saw a bird which flied across
which had some food for its lovely mate
it flied to a tree where it had its nest
and then she gave the food it had
all my buddies have their partners.
but their buddy doesn’t have one.

Pachi kavitha
Posted on May 21, 07 @ 11:04 am under My Poetry and has no comments.
Suresh and I composed this in our office canteen.
నచ్చిన చెలితో
అచ్చికబుచ్చికలాడి
మచ్చిక చేసుకుని
పచ్చని పార్కుల్లో
పచ్చిక మైదానాలపై
వెచ్చని చెలి ఒడిలో పడుకుని
గుచ్చి గుచ్చి కళ్లల్లోకి చూస్తూ
పిచ్చి పిచ్చి పనులు చేస్తే
రొచ్చవుతుంది

Bhaamalu
Posted on May 20, 07 @ 02:50 pm under My Poetry and has no comments.
చిలుక వంటి భామలు
చక్కనైన చుక్కలు
తళుకుబెళుకు సోకులు
తస్సదీయ సొగసులు
ప్రేమలొలుకు ముంతలు
జారిపోవు జాజులు
సుడి ఉంటే సోకులు
లేకపోతే కులుకులు
నిదురిస్తే తలపులు
ఎదురొస్తే తడుములు
గుర్తిస్తే బతుకులు
గర్జిస్తే తన్నులు

Remembering her - 1
Posted on May 20, 07 @ 02:46 pm under My Poetry and has no comments.
వినవా నా మాటలని
వినవా నేచెప్పాలనుకున్నది.
చిరుగాలి నిన్ను చేరి నా ప్రేమను చెప్పాలనుకుంటోంది
కనిపించని గాలిలో కనిపించే నా ప్రేమని చూడు.
నిన్ను తాకిన గాలిని చీదరించకు
అది నా స్పర్శని నీకు తెలియజేయాలనుకుంటోంది.
నిన్ను పలకరించే పూలని చూడు
నా ప్రేమలోని అందాన్ని ఆనందాన్ని చూడు.
నేను చెప్పే మాటలని విను
ప్రతి అక్షరంలోని ఆప్యాతని చూడు.
నేను విసిగిన క్షణాలని చూడు
ఆత్మీయంగా తీసుకున్న చొరవని చూడు.
విరిసిన చిన్న పువ్వులని చూడు
అవి నా మనస్సులోని నీ ఆలోచనలని గుర్తించు.
రాత్రి ఒంటరిగా ఉన్నానని చింతించకు
వెన్నెలగా నిన్ను పలకరిస్తుంటాను
కొన్ని సార్లు కనిపించనని అనుకోకు
తారల కాంతిలో నీ వెనకే ఉంటాను
ఓ గాలీ, నాకు నా మనసుకి మధ్య ఉన్న నువ్వు
నా చెలిని నాకిచ్చి కలిగించవా ఓ చిరు నవ్వు
ఆకాశంలోని పక్షుల్లా ఎగిరే నా మనసుకు
కల్పించవా నా చెలి మనసులో ఓ వెచ్చని గూడు
పంజరంలో ఉన్న నా మనసుకి రెక్కలు వచ్చి
ఎగరాలని ఉంది నా చెలి చెంతకు
చెప్పాలని ఉంది ఎన్నో ఊసులని
వినాలనుంది ఆమె మధుర స్వరాన్ని
గుర్తుకొచ్చిన క్షణాలను తిరిగి తీసుకురాలేని కాలమా
కల్పించవా నా చెలితొ ఉండే అవకాశం ఆజన్మాంతం.
పట్టిన కలం విడువక వ్రాస్తున్న ఈ భావాల్లోని ఆంతర్యాన్ని
నమ్మిన చెలిని వదులుకుంటానెమోనని భయపడే నా మనసుని
మనసులోని భావాలకి అక్షర రూపం కల్పిస్తూ
ఆ అక్షరమాలికని నా చెలి కురులకు కానుకగా ఇవ్వాలి
నా చెలికి చెప్పాలనుకున్న విషయాలను చూస్తున్న ఓ కాంతులారా
నేను చెప్పాలనుకున్న ఊసులను మీరైనా చెప్పరా..
ఎన్నో రోజుల ఎడబాటు తర్వాత పృథ్విని
పులకరింపజేసే వర్షపు చినుకుల్లారా
నా చెలి చెప్పలేని మౌనగీతాలని చెప్పి
నా మదిలో పరిపళించే గంధాన్ని నా చెలికందజేయరా.
నిన్ను నేనుగా చూడలేని జీవితంలో
నన్ను నిన్నుగా చూడమని చెప్పే నా మనసు
నిన్ను నన్నుగా మార్చవద్దని శాసిస్తూ
నేను చూసిన నిన్ను నాకందజేయమని అర్థిస్తోంది.
ఒంటరితనంలో విసిగిన నా జీవితంలో
నువ్వు తోడు నీడై ఉండాలని కోరుకుంటూ
నా కవి హృదయం చెప్పే మాటలని
హారంగా చేసి నీ మెడలో వేస్తున్నా
నువ్వులేని జీవితం ఊహించడానికే భయపడే నా మనసు
నీ ముందు చెప్పాలనుకున్న ఊసులని చెప్పలేదేమో మరి..
చెప్పకనే చెప్పే నా కళ్ళలోని ప్రేమని
కనులతోనే గమనించవా మరి.
సముద్రంలోని నీరు తీరానికి తన ప్రేమని చెప్పాలనుకుంటూ
అలల రూపంలో నిరంతరం ఆప్యాయంగా స్పృశించి పొందే
అనుభూతిని తను కూడా అనుభవించాలంటూ
ఉవ్విళ్ళూరే నా మనసుకు సమాధానమేమిటో..
నిరంతరం నీ ప్రెమను అనుభవిస్తున్న నాకు
చెప్పాలని ఉవ్విళ్ళూరే మనసుకు
చివరికి మిగిలేది గెలుపో ఓటమో..
చలిగా ఉన్న క్షణాలలో
నీ ఆలోచనల వెచ్చదనంలో
చలి కాచుకుంటున్నాను
(కంప్యూటర్ వాణ్ణి కదా అందుకే.. )
నా కంప్యూటర్లో ప్రాసెసర్ ఒంటరిగా ఔట్‍పుట్‍ని కూడా కంట్రోల్ చేస్తోంది
గ్రాఫిక్స్ కార్డ్ గా నేను చేసే పని పంచుకుని నా జత కావా.. :-)
----------------------
English translation for some verses:
listen to my words.. listen to what i want to say..
the air is reaching u to show my love on you.
in the invisible air, try to see the love that i have on you
look at the flowers.. and try to see the beauty of my love in their fragrances.
oh air, u are between me and my beloved. so give me the pleasure by presenting her to me
my heart is flying like a bird in the sky, searching for the nest in the heart of my beloved
oh time, u cannot bring back the memorable moments i had with her. but u can give me some more moments by making me live with her till the end of my life.
i am phrasing the feelings in my heart, and let this garland of words decorate her hair.
like the fragrance which is spilled by earth when the first rain falls, let her feel the fragrance of my heart.
my heart is scared with the thought that it cannot live without u, so it is not able to express my love completely. so see the love i have through my eyes,
as the waves in the ocean are touching the shore to express the love, my heart touching u with its words.
when i feel shivering cold, i get the warmth with the thoughts of u and the moments i had with you.

Bhayamestondi
Posted on May 20, 07 @ 02:40 pm under My Poetry and has no comments.
I wrote this when I felt that I can’t have her.
భయమేస్తోంది నిన్ను వదులుకుంటానని
భయమేస్తోంది నీ మాటలు వినలేనని
నీతో మాట్లాడలేనని
నీలోని ఆనందాన్ని చూడలేనని
నీతో మాట్లాడిన క్షణాలని
నీతో గడిపిన సమయాన్ని
నీతో ఊహించిన జీవితాన్ని
నీతో అల్లుకున్న ఆలోచనలని
నీతో ఆలోచించిన విషయాలని
నీతో తిన్న తీయని పళ్లని
నీతో చూసిన తారలని
నీలో చూసిన నన్ను
నీ కళ్ళల్లో కాంతులని
నీ పెదవిపై పలికిన నా పేరుని
నీ ఆలోచనల్లోని నన్ను
నీకై పుట్టిన నన్ను
భయమేస్తోంది నిన్ను వదులుకుంటానని
భయమేస్తోంది నీ మాటలు వినలేనని

Pages: [1]
|